: చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజ్ నాథ్ ఫోన్ చేశారు. అడవుల్లో జరిగిన ఘటనలపై, ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ సందర్భంగా బాబు తెలిపారు. నిన్న ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం దొంగలు మరణించిన సంగతి తెలిసిందే.