: వారంతా గడ్డి కోసుకోవడానికి మాత్రమే రాలేదు... శేషాచలం ఎన్ కౌంటర్ పై బొజ్జల
శేషాచలం అడవుల్లో నిన్న జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ పై ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. ఎన్ కౌంటర్ పై విపక్షాలు, తమిళుల ఆందోళనలు, జాతీయ మానవ హక్కుల సంఘం, కేంద్రం మొట్టికాయల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన బొజ్జల, ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారంతా ఎర్రచందనం దొంగలేనని ప్రకటించారు. అయితే వారంతా కేవలం గడ్డి కోసుకోవడానికి మాత్రమే శేషాచలం అడవులకు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా అమాయకులైన కూలీలను పొట్టనబెట్టుకున్నారన్న ప్రజా సంఘాలకు ఆయన ఘాటుగానే సమాధానమిచ్చారు. ఎర్రచందనం అక్రమ తరలింపు వెనుక సూత్రధారులెవరు, పాత్రధారులెవరన్న విషయాన్ని త్వరలోనే తేలుస్తామని ఆయన ప్రకటించారు.