: ప్రారంభమైన సిద్ధయ్య అంతిమ యాత్ర... వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన జనం


జానకీపురం ఎన్ కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల బుల్లెట్ గాయాలతో మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్సై సిద్ధయ్య అంతిమ యాత్ర కొద్దిసేపటి క్రితం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రారంభమైంది. ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన సిద్ధయ్యకు కడసారిగా వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఆ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, మల్లు రవి తదితరులు సిద్ధయ్య భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. మరికొద్దిసేట్లో అంత్యక్రియలు ముగియనున్నాయి.

  • Loading...

More Telugu News