: టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు... చిక్కిన కేరళ, తమిళనాడు 'ఎర్ర' స్మగ్లర్లు
చిత్తూరు జిల్లాలో ఈ ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు జరిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్మగ్లర్లతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 1.20 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం కొండల్లోని విలువైన ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే ఉద్దేశంతోనే వీరు మకాం వేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల సోదాలు ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు, చంద్రగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలు స్మగ్లర్ల కోసం జల్లెడ పడుతున్నాయి.