: శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్... మధ్యాహ్నం విచారణ!
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 మంది ఎర్రచందనం కూలీలు దుర్మరణం పాలైన ఈ ఘటనపై ఇప్పటికే తమిళులు నిరసనలు కొనసాగిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో ఈ ఘటనపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఓ న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు నేటి మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వం, డిజీపీ, స్పెషల్ ఆపరేషన్స్ డిజీలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు.