: రిజర్వ్ బ్యాంకును వీడి ఐఎంఎఫ్ కు రాజన్!


రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురాం రాజన్ తన పదవికి రాజీనామా చేయవచ్చని, తదుపరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్-అంతర్జాతీయ ద్రవ్య నిధి) హెడ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చని వార్తలు వెలువడ్డాయి. గతకొంత కాలంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆర్‌బిఐకి మధ్య దూరం పెరిగింది. ఆర్‌బిఐ నియంత్రణ అధికారాలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజన్ మనసు మారిందని 'నో కాన్సెన్సస్' (ఏకాభిప్రాయం లేదు) పేరిట ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికి అవసరమయ్యే అధికారాలను దూరం చేసిన తరువాత రాజన్ ఐఎంఎఫ్ వైపు చూస్తున్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News