: గుజరాత్ నకిలీ ఎన్ కౌంటర్ మాదిరే వికార్ ను మట్టుబెట్టారేమో?... విచారణకు డిగ్గీరాజా డిమాండ్


ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దు ఆలేరు, జనగాం మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్ తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు కాల్చి చంపారు. కోర్టుకు తీసుకెళుతున్న తమపై దాడికి దిగి పారిపోయేందుకు యత్నించడంతోనే కాల్పులు జరిపామని ఎస్కార్ట్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మైనారిటీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. వికార్ ను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్, ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్ లో వెలుగుచూసిన నకిలీ ఎన్ కౌంటర్ తరహాలోనే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగిందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News