: ఢిల్లీలో 'ముద్రా బ్యాంకు'ను ప్రారంభించిన మోదీ


ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ 'ముద్రా బ్యాంకు'ను ప్రారంభించారు. రూ.20వేల కోట్ల మూలధనంతో ఈ బ్యాంకును ప్రారంభించారు. దాని ద్వారా చిన్న వ్యాపారస్థులకు రూ.10 లక్షల క్రెడిట్ అందనుంది. అంతేగాక 'సూక్ష్మరుణ సంస్థలకు' (మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) నియంత్రణ చట్టంగా పని చేస్తుంది. 5.77 కోట్ల చిన్న పరిశ్రమలకు ముద్రా బ్యాంకు నుంచి ప్రయోజనం అందుతుందని ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ చెప్పారు. పెద్ద పరిశ్రమలు కేవలం రూ.1.25 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందని, స్వయం ఉపాధిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ఉపాధి సృష్టించేవారికి కొంచెం సాయం చేస్తే పెద్ద మార్పు వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News