: కోటి మంది కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త... పెరిగిన డీఏ


కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. డీఏ (డియర్నెస్ అలవెన్స్)ను 6 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ప్రస్తుతం అమలవుతున్న 107 శాతం డిఏ 113 శాతానికి పెరిగింది. జనవరి 2015 నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో 48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 55 లక్షల మంది పెన్షనర్లకు లాభం కలుగనుండగా, ప్రభుత్వ ఖజానాపై 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,889.34 కోట్ల భారం పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

  • Loading...

More Telugu News