: నడిరోడ్డుపై కాలిబూడిదైన బైక్... ఉప్పల్ చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జాం!
రోడ్డుపై వెళుతున్న బైక్ లో నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. జనం చూస్తుండగానే సదరు బైక్ కాలి బూడిదైంది. నడిరోడ్డుపై చెలరేగిన మంటలతో వాహనదారులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో క్షణాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఉప్పల్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రయ్యిమని దూసుకెళుతున్న క్రమంలో బైక్ నుంచి మంటలు రావడంతో సదరు బైక్ పై ఉన్న వ్యక్తి వాహనాన్ని పడేసి, పక్కకు తప్పుకున్నాడు. క్షణాల్లోనే ఆ బైక్ అగ్నికి ఆహుతైంది. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.