: సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో ఉగ్రవాదులు?...ఐబీ హెచ్చరికలతో పోలీసుల సోదాలు


తెలంగాణలో వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో నగర పోలీసులు అలర్టయ్యారు. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ను జల్లెడపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు ఉగ్రవాదులు తరలి వస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో దాదాపు 200 మంది పోలీసులు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో సోదాలు కొనసాగిస్తున్నారు. నేటి ఉదయం ప్రారంభమైన ఈ సోదాల్లో ఇప్పటికే ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ లో సోదాలకు ప్రయాణికులు సహకరించాలని కోరుతున్న పోలీసులు స్టేషన్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల సోదాలతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News