: తమిళనాట తగ్గని ఉద్రిక్తత... నేడు కూడా బస్సులు బంద్
తమ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ, తమిళనాట జరుగుతున్న ఆందోళనలు సద్దుమణగలేదు. దీంతో ఇవాళ కూడా చెన్నైకి బస్సు సర్వీసులు నిలిపి వేస్తున్నట్టు ఏపీ ఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఫలితంగా, నెల్లూరు నుంచి చెన్నై, చిత్తూరు నుంచి చెన్నై వెళ్లే రూట్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు రైళ్ళను ఆశ్రయించడంతో ఈ మార్గాల్లో ప్రయాణించే రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. కొన్ని బస్సులు నెల్లూరు నుంచి తడ వరకూ వెళ్లి వెనక్కు వస్తుండగా, అక్కడినుంచి చెన్నై వెళ్లేందుకు ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.