: ఎన్ కౌంటర్ సిబ్బందికి సెలవులు...అంతర్గత విషయాల గోప్యతకు పోలీసు బాసుల నిర్ణయం!
తెలంగాణలో వారం వ్యవధిలో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఎదురు దాడుల్లో నలుగురు పోలీసులు కూడా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్లకు సంబంధించి ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పోలీసు సిబ్బందికి సెలవులు మంజూరయ్యాయి. రెండు ఎన్ కౌంటర్లలో పాలుపంచుకున్న పోలీసు సిబ్బంది ప్రస్తుతం సెలవులో ఉన్నారు. వీరిని సంప్రదించేందుకు మీడియా యత్నిస్తున్నప్పటికీ స్పందన కరవైంది. ఈ రెండు ఎన్ కౌంటర్లకు సంబంధించి అంతర్గత విషయాలను గోప్యంగా ఉంచే క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఎన్ కౌంటర్లలో పాల్గొన్న సిబ్బందికి సెలవు మంజూరు చేశారని తెలుస్తోంది. అంతేకాక ఉగ్రవాదుల నుంచి ప్రతీకార దాడులు ఉండవచ్చన్న అనుమానాలతోనూ సెలవులు మంజూరైనట్లు సమాచారం.