: విశాఖకు వీఐపీల వెల్లువ!


స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నానికి వీఐపీలు వెల్లువెత్తారు. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు సహా స్మార్ట్ విశాఖ సదస్సు, విజ్ఞాన కేంద్ర ప్రారంభం, ప్రతిభావంతులకు పురస్కారాలు తదితర కార్యక్రమాలు జరగనుండడంతో పలువురు దేశ విదేశీ ప్రముఖులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. వీరందరికీ మహా విశాఖ ఆత్మీయ స్వాగతం పలికింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికే నగరంలో బస చేయగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు నేడు రానున్నారు. పలువురు ఇతర రాష్ట్రాల, దేశాల ప్రతినిధులు నిన్ననే విశాఖ వచ్చారు.

  • Loading...

More Telugu News