: ఫ్రెండ్స్ తో కలిసి నారా లోకేశ్ మస్త్ మజా... సోషల్ మీడియాలో ఫొటోల హల్ చల్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ అమెరికాలోని తన ఫ్రెండ్స్ తో మజా చేసుకున్నాడు. లోకేశ్ ‘మజా’కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్ లలో వీటిని చూస్తున్న వీక్షకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలోని మిత్రబృందంతో కలిసి ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోకేశ్ విహరించారు. ఈ విహార యాత్రకు సంబంధించిన ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. తొలుత ‘ఇండియా-అన్ అఫీసియల్.బ్లాక్ స్పాట్.ఇన్’ అన్న లింక్ ద్వారా ఈ ఫొటోలు వెలుగుచూశాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి ఎక్కాయి. ప్రస్తుతం ఈ ఫొటోల మాతృలింక్ వెబ్ సైట్ నుంచి అదృశ్యమైనా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫొటోలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.