: సాల్ట్ లేక్ స్టేడియాన్ని ఉర్రూతలూగించిన హృతిక్ రోషన్


కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఉర్రూతలూగించాడు. షాహిద్ కపూర్, అనుష్కా శర్మ, ఫర్హాన్ అఖ్తర్ ల ప్రదర్శన అనంతరం వేదికనెక్కిన హృతిక్ స్టేడియంను డ్యాన్స్ చేయించాడు. ఎక్ పల్ కా జీనా పాటతో మొదలు పెట్టిన హృతిక్ తన ఎనర్జీతో అభిమానుల్లో జోష్ పెంచాడు. గతంలో ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన హృతిక్ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. హృతిక్ డాన్స్ వేస్తున్నంత సేపూ అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తిపోయింది. హోలీ రంగులు, దీపావళి కాంతులు, ఈద్ సంబరం, క్రిస్మస్ వేడుక పెప్సీ ఐపీఎల్ లో వున్నాయని హృతిక్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News