: భారత్ లో ఆ మూడు సీజన్లే కాదు, క్రికెట్ సీజన్ కూడా ఉంది: సైఫ్ అలీ ఖాన్
భారతదేశంలో ప్రతి ఏటా వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం వంటి సీజన్లతో పాటు తో పాటు క్రికెట్ సీజన్ కూడా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఆరంభ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సైఫ్ అలీ ఖాన్, ఐపీఎల్ జట్ల కెప్టెన్లను అభిమానులకు పరిచయం చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జేపీ డుమిని, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తదితరులను పరిచయం చేశాడు.