: అది ఎన్ కౌంటర్ కాదు...ముమ్మాటికీ హత్యే!: అసదుద్దీన్ ఒవైసీ
నల్గొండ-వరంగల్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరగాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై ఆయన ట్విట్టర్లో స్పందించారు. సూర్యాపేటలో పోలీసులపై జరిగిన కాల్పులకు జరిగిన ప్రతీకార హత్యగా వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ను పేర్కొన్నారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫేక్ ఎన్ కౌంటర్ పై జాతీయ సంస్థతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.