: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాయిలం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు శాతం డీఏ (డీర్ నెస్ అలవెన్స్)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.