: సీఎస్, డీజీపీలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఏవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడుకు నోటీసులు జారీ చేసింది. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలతో కూడాన నివేదిక అందించాలని, ఆరోపణలపై వివరణలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఈ ఎన్ కౌంటర్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ, మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.