: అంతర్వేదిని వణికించిన గ్యాస్ పైప్ లైన్ లీకేజీ
నగరం ఘటనను మర్చిపోని కోనసీమ ప్రజలు మరోసారి భయబ్రాంతులకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కరలోని కేవీ-ఓఎన్జీసీ బావి నుంచి వస్తున్న గ్యాస్ పైప్ లైన్ లీకయింది. పెద్ద శబ్దంతో బయటికి వెలువడిన గ్యాస్ ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మోరీ జీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జీసీఎస్ లో క్రూడ్ ఆయిల్ లీకవడంతో మరమ్మతులు చేస్తున్న సిబ్బంది, దానిని అదుపుచేసి, అంతర్వేది కరకేవీ-6 బావి వద్దకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు. గ్యాస్ లీకవకుండా కొంత మేర అదుపుచేశారు.