: ఇకపై 100, 101, 108కు ఫోన్ చేయక్కర్లేదు... 112కు ఫోన్ చేస్తే చాలు


సాధారణ పౌరుల కష్టాన్ని ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) అర్థం చేసుకుంది. అత్యవసర సేవలు అందించే పోలీసులు (100), ఫైర్ (101), అంబులెన్స్ (108) నెంబర్లను గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించింది. దీంతో అమెరికాలోలా ఒకే నెంబర్ ను కేటాయించాలని కేంద్రానికి 112 ను ప్రతిపాదించింది. వేర్వేరు నెంబర్లు ఉండడం వల్ల ప్రతిదానికి ఒక నెంబర్ ను గుర్తుచేసుకుని, సంబంధిత అధికారులకు సమాచారం అందించడం ఇబ్బందిగా మారుతుందని, అలా కాకుండా ఒకే నెంబర్ పై అన్ని అత్యవసర సేవలు అందితే పౌరులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు అవసరమైన ఎవరైనా 112కు ఫోన్ చేస్తే, సంబంధిత శాఖ అప్రమత్తమై సేవలు అందించాలని పేర్కొంది. దీనికి కేంద్రం ఆదేశిస్తే, ఉపాథి కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు కూడా అందుతాయని ట్రాయ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News