: పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేమని ఆమె అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు బాగున్నాయని అన్నారు. ఖర్చు చేసిన ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరవుతాయని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కాకుండా, బీహార్, పశ్చిమ బెంగాల్ తరహా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆమె తెలిపారు. ఆమె తాజా వ్యాఖ్యలతో, పోలవరం, ప్రత్యేకహోదాపై ఓ స్పష్టత వచ్చినట్టైంది.