: కూలీలకు అడవుల్లో పనేంటి?: వెంకయ్యనాయుడు


చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో కూలీలకు పనేంటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఢిల్లీలో శేషాచలంలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం చెట్లను నరకడం నేరమన్న విషయం కూలీలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఏ పనికి వెళ్తున్నారో తెలియకుండా కూలీలు వెళ్తారా? అని ఆయన అడిగారు. స్మగ్లింగ్ కు కూలీలు సహకరించడం సరికాదని ఆయన హితవు పలికారు. కాగా, ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం నిజానిజాలు బయటికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News