: తమిళనాడులో ఆందోళన...ఐదు ఆంధ్రబస్సుల అద్దాలు ధ్వంసం
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ పై తమిళనాడులో ఆందోళనలు చేపట్టారు. చెన్నైలోని ఆంధ్రక్లబ్ ఎదుట తమిళనాడు కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళనకు దిగాయి. చెన్నై బస్టాండ్ వద్ద ఆందోళన కారులు నిరసనకు దిగారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే బస్సులను నిలిపేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. తమిళుల ఎన్ కౌంటర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని తమిళ్ కట్చి అనే సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ప్రముఖ ప్రాంతాల్లోని ఆంధ్రా ఆస్తుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.