: సిమి తీవ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఎస్సై సిద్ధయ్య మృతి
సిమి తీవ్రవాదుల కాల్పుల్లో జానకీపురం వద్ద గాయపడ్డ ఎస్సై సిద్ధయ్య మృతువుతో పోరాడుతూ మృతి చెందారు. నల్గొండ జిల్లా జానకీపురం దగ్గర గుట్టల్లో తుపాకులతో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో వారిని పట్టుకునేందుకు వెళ్లిన సిద్ధయ్య, వారి కాల్పుల్లో తీవ్రగాయాలతో మృత్యుముఖానికి చేరువయ్యారు. కామినేని ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందిన ఆయన శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు బయటికి తీశారు. మెదడు భాగంలో ఓ బుల్లెట్ ఉండడంతో, దానికి శస్త్ర చికిత్స చేయాలని భావించినప్పటికీ, అతని శరీరం సహకరించకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. వెంటిలేటర్ పై ఆయనకు వైద్యం అందిస్తూ వచ్చారు. చివరికి ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.