: ఉగ్రవాదులకు పోస్టు మార్టం ఎక్కడ నిర్వహించాలి?: అధికారుల తర్జనభర్జనలు
నల్గొండ-వరంగల్ జిల్లా సరిహద్దులో నేటి ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల మృతదేహాలకు పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలో అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. నల్గొండ లేక వరంగల్ లో ఎక్కడ చేయాలనే విషయంపై వారు తర్జనభర్జనలు పడుతున్నారు. న్యాయసలహా తీసుకునేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. వికారుద్దీన్ ముఠాసభ్యుల మృతదేహాలు ప్రస్తుతం వరంగల్ జిల్లా జనగాం ప్రాంతీయ వైద్యశాలలో ఉన్నాయి.