: నేను అగ్గిపెట్టెతోనే విమానం ఎక్కుతా... దాంతో హైజాక్ చెయ్యొచ్చా?: అశోక్ గజపతిరాజు
విమానాల హైజాక్ విషయంలో కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విమానాల వరుస ప్రమాదాల నేపథ్యంలో విమానాశ్రయాల్లో తనిఖీలపై స్పందిస్తూ, తాను చైన్ స్మోకర్ నని, ఎల్లప్పుడూ అగ్గిపెట్టో, లైటరో వెంటే ఉంటుందని అన్నారు. అంతే కాదు, కేంద్ర మంత్రిని కాబట్టి తననెవరూ తనిఖీ చేయరని, అగ్గిపెట్టెతో ఎవరైనా విమానాన్ని హైజాక్ చేసే వీలుంటుందా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎప్పుడైనా అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ చేసిన ఘటన జరిగిందా? అని అడిగారు. పైగా తానన్నదాంట్లో తప్పు లేదని సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అవాక్కవడం మీడియా వంతైంది.