: సునీల్ నరైన్ మా అదనపు బలం : గంభీర్
వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ తమ జట్టుకు అదనపు బలమని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. కోల్ కతాలో గంభీర్ మాట్లాడుతూ, మిస్టరీ స్పిన్నర్ నరైన్ రంగప్రవేశంతో నైట్ రైడర్స్ బలం పుంజుకుందని అన్నాడు. కాగా, టీ20ల్లో నరైన్ పై విధించిన నిషేధాన్ని పలు పరీక్షల అనంతరం ఐసీసీ, బీసీసీఐ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో నరైన్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు. నేడే ఐపీఎల్ సీజన్8 ప్రారంభ వేడుకలు కోల్ కతాలో జరగనుండగా, రేపటి నుంచి మ్యాచ్ లు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.