: అడవిలో విషపు పళ్లు తిని 14 మంది మృత్యువాత


రహదారి నిర్మాణ పనుల నిమిత్తం అడవుల్లోకి వచ్చిన కూలీలు ఆకలి తీర్చుకునేందుకు విషపూరితమైన పళ్లు తినగా, వారిలో 14 మంది మరణించారు. ఈ ఘటన మేఘాలయలోని తూర్పు జైనతేయ కొండల్లో జరిగింది. పోలీసు అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, కూలీలంతా అస్సాంలోని దుబ్రి జిల్లాకు చెందిన వారు. రోడ్డు నిర్మించే నిమిత్తం కూలీ చేసేందుకు వీరు వచ్చారు. సమీపంలోని అడవిలో వారు విషపూరితమైన పండ్లను తిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు నమొదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News