: తెలంగాణలో బీరు ధరల పెంపు... లైట్ బీరుపై రూ.5, స్ట్రాంగ్ బీరుపై రూ.10 వడ్డన!


తెలంగాణలో బీరుప్రియుల జేబుకు చిల్లు పడిపోయింది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే మందుబాబుల జేబులను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దాంతో తెలంగాణలో గడచిన రాత్రి నుంచి బీరు ధరలు పెరిగాయి. వేసవి ప్రారంభం కావడంతో బీర్లకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో గిరాకీని క్యాష్ చేసుకునే క్రమంలో కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. లైట్ బీరు ధరను రూ.5 పెంచిన ప్రభుత్వం, స్ట్రాంగ్ బీరుపై ఏకంగా రూ.10 పెంచింది. పెంచిన ధరలు గడచిన రాత్రి నుంచే అమల్లోకి వస్తాయని నిన్న విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పెంచిన ధరల ప్రకారం లైట్ బీరు రూ.90 పలకనుండగా, స్ట్రాంగ్ బీరు ధర రూ.105కు చేరింది.

  • Loading...

More Telugu News