: అంతర్ రాష్ట్ర రవాణా పన్నుపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
అంతర్ రాష్ట్ర రవాణా పన్ను విధానంపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ నెల 11వరకు వీటిని పొడిగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన రవాణా పన్నును సవాల్ చేస్తూ పలు ట్రావెల్స్ యాజమాన్యాలు కొన్ని రోజుల కిందట కోర్టును ఆశ్రయించాయి. దాంతో వారికే వర్తించేలా న్యాయస్థానం మధ్యంతర స్టే విధించిన సంగతి తెలిసిందే.