: నా కుమారుడిపై పోలీసులు కక్షగట్టి చంపేశారు: ఉగ్రవాది వికారుద్దీన్ తండ్రి
తన కుమారుడు వికారుద్దీన్ పై పోలీసులు కక్షగట్టి ఎన్ కౌంటర్ చేసి చంపేశారని అతని తండ్రి మహ్మద్ ఆరోపిస్తున్నాడు. 90 శాతం కేసు విచారణ పూర్తయినప్పటికీ అన్యాయంగా పొట్టునబెట్టుకున్నారని అన్నాడు. వరంగల్ జైలు నుంచి హైదరాబాదు జైలుకు తరలించాలని నెల కిందట ఒకటి, నిన్న ఒక పిటిషన్ కూడా వేశామని చెప్పాడు. ఈ లోగానే చంపేయడం ఆశ్చర్యం కలిగించిందంటున్నాడు. కోర్టు వాయిదా కోసం వికారుద్దీన్ తో పాటు మరో నలుగురిని వరంగల్ జిల్లా సెంట్రల్ జైలు నుంచి హైదరాబాదు తీసుకొస్తుండగా మార్గ మధ్యంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో హైదరాబాదులో హై అలెర్టు ప్రకటించారు.