: అవును, మా ఆవిడ చెప్పింది నిజమే కదా!: భార్య 'అత్యాచార' వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ మంత్రి


బిగుతు దుస్తులు, పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం వల్లనే అత్యాచారాలు పెరిగాయని, పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ కు పంపరాదని తన భార్య లలిత చేసిన వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్ధించారు. అమ్మాయిలు అంగాంగ ప్రదర్శన కోసం బిగుతైన దుస్తులు వేసుకుంటున్నారని, ఈ పరిస్థితి మారాలని నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మహిళలు డ్రెస్ విషయంలో సరిగా లేకపోవడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్న మాట నిజమేనని దీపక్ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే అత్యాచారాలు పెరుగుతున్నాయని భార్య వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె భారత సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైనదంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News