: ఇద్దరు నేరస్థులను ఉరి తీసిన పాకిస్థాన్


సరిహద్దు దేశం పాకిస్థాన్ లో పలువురు నేరస్థులకు ఉరిశిక్ష అమలు కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు నేరస్థులను ఉరి తీసినట్టు మీడియా సమాచారం. 1997లో జంట హత్యల ఘటనలో నేరస్థుడైన జాఫర్ ను సహివాల్ సెంట్రల్ జైల్లో ఉరి తీసినట్లు ప్రముఖ ఆన్ లైన్ వెబ్ సైట్ డాన్ తెలిపింది. 2000లోనే ఉరిశిక్ష పడిన అతనికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మార్చి 25న ఉరి అమలు కావల్సి ఉంది. కానీ ఒక ఒప్పందం కారణంగా ఉరిశిక్ష ఆలస్యమైంది. మరో వ్యక్తి తయ్యబ్ గులామ్ నబీ. ఇతన్ని లాహోర్ లోని కోట్ లక్ పత్ జూల్లో ఉరి తీశారు. 2002లో ఓ హత్య కేసులో ఓ జిల్లా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 16న పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై తాలిబన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 150 మందికి పైగా మరణించారు. దాంతో మేలుకొన్న పాక్ ప్రభుత్వం అప్పటివరకు మరణశిక్ష అమలుపై ఉన్న నిషేధాన్ని మార్చి 10న ఎత్తి వేసింది. దాంతో వరుసగా పాక్ లో ఉరి శిక్షలు అమలవుతూ వస్తున్నాయి.

  • Loading...

More Telugu News