: ప్రకాశం జిల్లాకు పాకిన తుపాకీ సంస్కృతీ... బెదిరించి దారి దోపిడీ


దారినపోతున్న వారిని తుపాకీతో బెదిరించి దోపిడీ చేస్తున్న దుండగులు ప్రకాశం జిల్లాకు చేరారు. ఇటీవలి నల్గొండ, నిన్నటి కృష్ణా జిల్లా జాతీయ రహదారి ఘటనలు మరువకముందే, ఈ ఉదయం అదే తరహా దోపిడీ ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుకు 20 కిలోమీటర్ల దూరంలోని సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు ప్రయాణికులను తుపాకీతో బెదిరించిన ఒక దుండగుడు రూ. 40 వేలు దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News