: వరంగల్, గుంటూరుల్లో 'ఫ్యాన్ పార్కు'లకు బీసీసీఐ శ్రీకారం


ఐపీఎల్ షెడ్యూల్ లో వరంగల్, గుంటూరు స్టేడియాలు లేవనేగా, మీ అనుమానం. స్టేడియాలైతే లేవుగాని, బీసీసీఐ చేపట్టిన సరికొత్త చర్యలతో ఈ రెండు నగరాల్లోనూ... స్టేడియంలో కూర్చుని మ్యాచ్ ను తిలకించిన అనుభూతితోనే ఐపీఎల్ మ్యాచ్ లను చూడొచ్చు. ఎలాగంటే, ఐపీఎల్ మ్యాచ్ లను ఆయా నగరాల్లోని క్రీడాభిమానులు కొత్త అనుభూతితో వీక్షించేందుకు బీసీసీఐ ‘ఫ్యాన్ పార్కు’ల పేరిట కొత్త తరహా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, ఆయా నగరాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో భారీ తెరలను ఏర్పాటు చేస్తుంది. వీటిలో మ్యాచ్ లైవ్ ను ప్రసారం చేయనుంది. అంతేకాక బిగ్ స్క్రీన్ ల వద్ద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటవుతాయి. భారీ తెరపై ఒకేసారి దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కుల్లోకి ప్రవేశం ఉచితంగానే లభిస్తుందట.

  • Loading...

More Telugu News