: దేవుడా... షేక్స్ పియర్, మేథమేటిక్స్ పదాలకు స్పెల్లింగ్ తెలియని వారు ఆన్సర్ పేపర్లు దిద్దుతున్నారు!


మొన్నామధ్య ఒక ఆరంతస్తుల భవనంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతుంటే, తమవారికి చిట్టీలు అందించేందుకు వందలాది మంది కిటికీలెక్కిన దృశ్యాలు గుర్తుండే ఉంటాయి. ఎలాగోలా పరీక్షల ప్రహసనాన్ని ముగించిన అధికారులు మూల్యాంకనం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. బీహార్లోని సహస్ర జిల్లాలో విద్యార్థుల ఆన్సర్ పేపర్లు దిద్దుతున్న వారికి కనీస పరిజ్ఞానం లేదని తెలుస్తోంది. 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ దిద్దుతున్న ఒక టీచర్ ను 'Shakespeare' స్పెల్లింగ్ చెప్పమని కోరగా, ఆయన ఆలోచిస్తూ, "s-h-a-k-s-p-e-a-r" అని చెప్పాడు. ఇక లెక్కల పేపర్ దిద్దుతున్న టీచర్ ను 'Mathematics' స్పెల్లింగ్ చెప్పమని కోరగా, ఆయన "M-a-t-h-m-a-t-e-s" అని సమాధానం ఇచ్చాడు. ఈ వ్యక్తి ఒక హై స్కూల్ లో 9వ తరగతికి లెక్కలు చెపుతారట. మరి 'ఆ' టైపులో కాపీలు కొట్టి పాస్ అయినవారికి ఇంతకన్నా ఇంకేం తెలుస్తుంది? ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, తమకు పాస్ మార్కులు వేయాలని పలువురు జవాబు పత్రాల మధ్య కరెన్సీ నోట్లు పెట్టడం సర్వసాధారణమట.

  • Loading...

More Telugu News