: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా జస్టిస్ సదాశివం... కేంద్రం యోచన, త్వరలో నిర్ణయం!


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ త్వరలోనే ఆ పదవి నుంచి తప్పుకోవడం ఖాయమేనని తెలుస్తోంది. అంతేకాక ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేరళ గవర్నర్ జస్టిస్ సదాశివం నియమితులు కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన వివాదాలు తలెత్తుతున్నాయని భావిస్తున్న కేంద్రం, సదరు వివాదాలను సదాశివం లాంటి న్యాయ కోవిదుడైతేనే పరిష్కరించగలరని భావిస్తోంది. అంతేకాక తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం అనుభవజ్ఞుడైన వ్యక్తి గవర్నర్ గా ఉంటే బాగుంటుందన్న వాదన కూడా కేంద్రం పెద్దల్లో వ్యక్తమవుతోంది. త్వరలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, పలువురికి స్థానచలనంపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ మార్పుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News