: చాంద్రాయణగుట్టలో కార్డాన్ అండ్ సెర్చి ఆపరేషన్... పలువురు అనుమానితుల అరెస్ట్
హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పరిధిలోని ఇంద్రా నగర్ లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చి సోదాలను జరుపుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంద్రానగర్ ను చుట్టుముట్టిన 300 మంది పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో ఇప్పటికే పలువురు అనుమానితులు అరెస్టైనట్లు సమాచారం. నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ తదనంతరం జరుగుతున్న ఈ సోదాల్లో పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.