: బెజవాడలో క్యాంపు ఆఫీస్... తుళ్లూరులో ఇంటి స్థలం: చంద్రబాబు నిర్ణయం


రెండు నెలల్లో విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. ఇందుకు వీలైతే ఏదైనా ప్రభుత్వ భవనాన్ని తీసుకోవాలని, ఒకవేళ దొరకకపోతే ప్రైవేటు భవనాన్ని అయినా అద్దెకు తీసుకుని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారట. నివాసంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు ప్రాంతంలో ప్రస్తుతం వసతులు లేనందువల్ల విజయవాడలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు, అమరావతి ప్రాంతంలో తన ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News