: 'జులాయి'తో కిక్ కొట్టారు...'సన్నాఫ్ సత్యమూర్తి'తో రైడ్ చేస్తారు: అల్లు అర్జున్
తనకు మంచి సినిమా పాటలు ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ కు ధన్యవాదాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. విజయవాడలో జరిగిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) అంటే, అందరికీ డైనమిక్, డేరింగ్ ఇలా ఉంటాయని, తనకు మాత్రం డియరెస్ట్ స్పెషల్ పర్సన్ అని అన్నారు. ఎంతో కష్టమైన పదాలతో ఉండే సూపర్ మిర్చి పాట రాసిచ్చాడని అన్నాడు. అలాగే తనకు ఇష్టమైన ఛల్ చల్రే చలో, లైఫు సే మిలో అంటూ ఓ పాటను బాగా రాసి, మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నాడు. సినిమా అభిమానులను అలరిస్తుందని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జులాయితో కిక్ కొట్టి బండి స్టార్ట్ చేశారని, సన్నాఫ్ సత్యమూర్తితో వేగం పెంచుతారని ఆశిస్తున్నానని చెప్పాడు.