: పవన్ కల్యాణ్ గారు నన్ను ఇబ్బంది పెట్టే స్నేహితుడులా మారుతున్నారు: త్రివిక్రమ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తనకు ఇష్టమైన స్నేహితుడని, అయితే అభిమానుల కారణంగా ఆయన తనను ఇబ్బంది పెట్టే స్నేహితుడుగా మారుతున్నారని అన్నారు. ప్రతి ఫంక్షన్ లో అభిమానులు పవన్ కల్యాణ్ గారి గురించి అడుగుతారని అన్నారు. అభిమానుల అభిమానాన్ని ఆయనకు చూపిస్తానని అన్నారు. ఆయన టీవీ చూడరు కనుక, వెళ్లాక విశేషాలు చెబుతానని ఆయన చెప్పారు. 'నాయకుడనేవాడు జనంతో పాటు నడవకూడదు, జనం కంటే నాలుగడుగులు ముందుండాలని' అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. పవన్ కల్యాణ్ ను చూసిన ప్రతిసారీ అదే అనిపిస్తుందని ఆయన చెప్పారు. పదడుగుల పది అంగుళాల పొడుగు, బక్క పల్చగా ఉండే ఒళ్లు, తీక్షణంగా ఉండే కళ్లు, ఒక జాతిని శాసిస్తాడని అతని తల్లిదండ్రులు, అతన్ని పైకి తెచ్చిన అన్న కూడా పవన్ కల్యాణ్ గురించి ఊహించి ఉండరని త్రివిక్రమ్ అన్నారు.