: ఇకపై ఆకాశంలో పార్టీలు చేసుకోవచ్చు...!


భవిష్యత్ లో ఆకాశంలో పార్టీలు చేసుకోవచ్చు. అక్కడి పబ్బుల్లో డాన్సులు చేయవచ్చు, ఎలా అంటారా? డిరోసోలార్ కంపెనీ డబ్బున్న వారి కోరికలు తీర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా విమాన యానం అంటేనే గొప్ప, అలాంటిదీ ఓ విమానంలో పార్టీ చేసుకున్నారంటే అది మరింత గొప్పగా ఉంటుంది. దీనికోసం టైటానిక్ షిప్ లాంటి ఎయిర్ షిప్ ను నిర్మించేందుకు డిరోసోలార్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ విమానంలో స్విమ్మింగ్ పూల్, చెట్లు, డిస్కోలు, బార్లు, రెస్టారెంట్లు వంటి సకల సౌకర్యాలు ఉంటాయని, ఆకాశంలో విహరిస్తూ పార్టీలు చేసుకోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. ఈ విమానం గుడ్డు ఆకారంలో ఉండడంతో దీనికి ల్యాండింగ్ కోసం రన్ వే అవసరం లేదని కంపెనీ పేర్కొంటోంది. దీనికి రెక్కలు ఉండని కారణంగా, వేగంగా వీచే గాలులు దీనిని ఏమీ చేయలేవని కంపెనీ తెలిపింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, దీనిని రూపొందిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.

  • Loading...

More Telugu News