: నంద్యాలలో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నంద్యాల పట్టణంలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మధ్యప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో తిరుపతి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారు చిత్తూరు జిల్లాను దాటిపోవడంతో కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులను వారు అప్రమత్తం చేశారు. దీంతో నంద్యాల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని కడప జిల్లా తరలించారు. అనంతరం వారిని నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించనున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, వారు ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. వారు సిమీ కార్యకర్తలా? ఇతరులా? అనేది వెల్లడి కావాల్సిఉంది.