: టీఆర్ఎస్ ఎమ్మెల్సీపై తహశీల్దారు ఫిర్యాదు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సలీంపై శంషాబాద్ తహశీల్దారు వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని శంషాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సలీం నివాసం ఉంటున్నారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ నిర్మించారు. దీనిని గుర్తించిన శంషాబాద్ తహశీల్దారు, ఆ కాంపౌండ్ వాల్ జీవో నెంబర్ 111కు వ్యతిరేకంగా ఉన్నట్టు గుర్తించి, దానిని కూల్చివేయమని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మార్వో ఆదేశాల ప్రకారం సిబ్బంది దానిని కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సలీం, తహశీల్దారుకు ఫోన్ చేసి నానా దుర్భాషలాడారట. 'సచివాలయంలో ఉన్నాను రా రా' అంటూ సవాలు విసిరారట. దీంతో మనస్తాపం చెందిన తహశీల్దారు వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.