: యువకుడ్ని బలిచ్చేందుకు విఫలయత్నం
సాంకేతిక హంగులతో సమాజాన్ని నిర్మించుకుంటున్నప్పటికీ, మూఢనమ్మకాలను మాత్రం వదల్లేకపోతున్నాం. గుప్త నిధులు పేరిట దుర్మార్గులు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడం లేదు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. నాగరాజు అనే యువకుడ్ని కొంత మంది కిడ్నాప్ చేసి, గుప్త నిధుల పేరిట బలిచ్చేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని వమ్ము చేసిన నాగరాజు, వారి బారినుంచి తప్పించుకుని పోలీసులను చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.