: హైదరాబాదును ముంచెత్తిన వర్షం


హైదరాబాదును భారీ వర్షం ముంచెత్తింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న రాజధాని ప్రజలను వరుణుడు కరుణించాడు. ఎండవేడిమికి చెక్ చెబుతూ, చల్లని జల్లులు కురిపించి నగరప్రజలకు ఉపశమనం కలిగించాడు. బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్, ఖైరతాబాద్ ఇతర ప్రాంతాల్లో సాధారణ స్థాయి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. యాదగిరిగుట్టలో కూడా వర్షం పడడం విశేషం.

  • Loading...

More Telugu News