: ఐపీఎల్ ఛైర్మన్ గా రాజీవ్ శుక్లా


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధ్యక్ష పీఠాన్ని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా మరోసారి అధిష్టించారు. ఆయన గత నెలలో జరిగిన బీసీసీఐ ఎన్నికల్లో ఐపీఎల్ ట్రెజరర్ పదవికి పోటీ చేసి, శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన ఆయన చక్కగా పావులు కదిపారు. బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా మద్దతులో ఆయన ఐపీఎల్ పాలకవర్గం అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కాగా, ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ వర్గం ప్రస్తుత అధ్యక్షుడు రంజీబ్ బిశ్వాల్ నే కొనసాగించాలని పట్టుబట్టినప్పటికీ, బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా తన మద్దతు శుక్లాకు తెలిపారు. దీంతో ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, 2013లో జరిగిన ఐపీఎల్ సీజన్6లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ జరిగినప్పుడు రాజీవ్ శుక్లా ఐపీఎల్ చైర్మన్ గా ఉన్నారు.

  • Loading...

More Telugu News