: మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో హారికకు కాంస్యం
ప్రపంచ మహిళల చదరంగం చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు తేజం ద్రోణవెల్లి హారికకు కాంస్యపతకం దక్కింది. రష్యాలోని సోచిలో జరిగిన సెమీఫైనల్స్ లో ఆమె ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ మరియా ముజ్యుచుక్ చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం జరిగిన ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్, రష్యా క్రీడాకారిణి నతాలిజాను మరియా ఓడించి స్వర్ణపతకం సాధించింది. దీంతో హారికను కాంస్యం వరించింది.